Tue Dec 24 2024 16:46:53 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ కాసింత చల్లబడిందిగా
తెలంగాణకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది
తెలంగాణకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్నటి నుంచి కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వడగాలులు వీయడం కూడా తగ్గింది. మొన్నటి వరకూ నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయిన చోట కొంత కూల్ వాతావరణం కనపడుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
నాలుగు రోజుల పాటు...
కొన్ని జిల్లాల్లో వర్షం కూడా నమోదు కావడంతో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలపడంతో తెలంగాణ వాసులు హ్యాపీగా ఫీలవుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో చల్లని కబురు వాతావరణ శాఖ అందించింది. నిన్న నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వానలు కూడా కురిశాయి.
Next Story