Thu Dec 19 2024 17:05:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మరో మూడు రోజులు వర్షాలేనట
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఈరోజు ఉదయం నుంచే అన్ని చోట్ల వర్షం ప్రారంభమయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అనేకచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కూడా కలిగింది.
భూగర్భజలాలు...
భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో వర్షాలు కురుస్తుండటం కొంత ఉపశమనం కలిగించే అంశమే. నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న దశలో ఈ వర్షం కొంత భూగర్భజలాల నీటి మట్టం పెంచుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. రెండు గంటల పాటు కురిసిన ఈ వర్షానికి నగర వీధులన్నీ జలమయమయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అయితే మండే ఎండల్లో కురిసిన వర్షం కావడంతో ఒకింత రిలీఫ్ నగరవాసులకు దక్కినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది.
Next Story