Wed Jan 08 2025 19:35:54 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు రెడ్ అలర్ట్
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
నేటి నుంచి భారీ వర్షాలు
నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, వికారాబాద్, , మహబూబాబాద్ , సిద్ధిపేట్, ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాజెక్టులు మళ్లీ పొంగి పొరలే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Next Story