Tue Nov 05 2024 11:37:34 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో నేడు, రేపు హాట్ వేవ్స్... జాగ్రత్త సుమా
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు రానున్న రెండు రోజుల్లో మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపిింది
ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు రానున్న రెండు రోజుల్లో మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపిింది. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉక్కబోతతో పాటు ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు రోడ్డు మీదకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. విద్యుత్తు వాడకం కూడా ఎక్కువయిందని అధికారులు చెబుతున్నారు
రానున్న నాలుగు రోజులు...
రానున్న నాలుగు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈజు 46 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఇంటినుంచి బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Next Story