Thu Jan 09 2025 10:12:01 GMT+0000 (Coordinated Universal Time)
11 జిల్లాలకు అలెర్ట్.. భారీ వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
రెండు రోజలుగా...
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. వాగులు ప్రవహిస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. లోతట్టు ప్రాంతాల వారిని ఇప్పిటికే పునరావాస కేంద్రాలకు తరలించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. అధికారులు ఎప్పటికప్పడు భారీ వర్షాలపై సమీక్షలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Next Story