Sun Dec 22 2024 18:18:13 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ సర్కార్ కు అక్బరుద్దీన్ వార్నింగ్
తనపై కక్ష ఉంటే తీర్చోవాలని, తనను తుపాకీతో కాల్చాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు
ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కక్ష ఉంటే తీర్చోవాలని, తనను తుపాకీతో కాల్చాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సకలం చెరువులో ఒవైసీ ఆసుపత్రి ఉందని, దానిని హైడ్రా కూల్చివేస్తుందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. తమపై కక్ష ను తీర్చుకోవడానికి ప్రజలకు సేవలందించే ఆసుపత్రిని కూలగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
తనను కాల్చేయండి అంటూ...
చెరువులను ఆక్రమించిన అనేక కట్టడాలను ఇటీవల హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమపై వేరే కేసులు పెట్టుకోవాలని, లేదంటే తుపాకీతో కాల్చి తనను చంపేయాలని, అంతేతప్ప ఆసుపత్రి జోలికి వస్తే ప్రజలే తిరగబడదారని హెచ్చరించారు.
Next Story