Sun Dec 22 2024 23:12:38 GMT+0000 (Coordinated Universal Time)
MIM : బీఆర్ఎస్ ది తప్పుుడు వ్యూహమే
బీఆర్ఎస్ ది తప్పుడు వ్యూహమని ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు
బీఆర్ఎస్ ది తప్పుడు వ్యూహమని ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీఆర్ఎస్ అలా ఎందుకు చేసిందో తనకు అర్థం కాలేదన్నారు. తనకు ఆ విషయం కూడా తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీికి మద్దతు తెలపడం విచారకరమని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు.
బీజేపీకి ఈసారి...
బీఆర్ఎస్ ఈ వ్యూహంతో తప్పుదారి పట్టిందని అన్నారు. బీజేపీకి అండగా నిలబడి తనకు తాను ఓటమి పాలయిందన్న వార్తలు చూసి తాను కూడా ఆశ్చర్యపోతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ ఇలాగే కొనసాగితే దాని మనుగడను అదే నాశనం చేసుకుంటుందని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఈసారి బీజేపీకి సీట్లు తగ్గడం మంచి సంకేతాలు ఇచ్చినట్లయిందని ఒవైసీ అన్నారు.
Next Story