Tue Dec 24 2024 16:06:59 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయ పాఠాలు నేర్పిన టీచర్ పాడె మోసిన మంత్రి
రిటైర్డ్ టీచర్ సోమిరెడ్డి మరణించారని తెలుసుకున్న దయాకర్ రావు జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని కామారెడ్డిగూడెంకు వచ్చారు
ఏ రాజకీయ నేత కయినా తనకు పాలిటిక్స్ లో ఒక దారి, మార్గదర్శనం వారిని, రాజకీయ పాఠాలు నేర్పిన వారిని అస్సలు మరవరు. ఎందుకంటే వారి రాజకీయ ఎదుగుదలకు వారే కారణం. జనగామ జిల్లాలో మరణించి రిటైర్డ్ టీచర్ సోమిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజకీయ సూచనలు, సలలహాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలతోనే తాను ఇంత స్థాయికి ఎదగడానికి కారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు నమ్ముతారు.
రాజకీయ పాఠాలు...
రిటైర్డ్ టీచర్ సోమిరెడ్డి మరణించారని తెలుసుకున్న దయాకర్ రావు జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని కామారెడ్డిగూడెంకు వచ్చారు. ఆయన పాడెను స్వయంగా దయాకర్ రావు మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ దయాకర్ రావు అక్కడే ఉన్నారు. రిటైర్డ్ టీచర్ సోమిరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని దయాకర్ రావు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో తాను పోటీ చేసిన నాటి నుంచి ఆయన మార్గదర్శనంలోనే నడిచానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాల్సి వస్తుందనుకోలేదని ఎర్రబెల్లి ఆవేదన చెందారు.
Next Story