Fri Apr 04 2025 17:24:52 GMT+0000 (Coordinated Universal Time)
హెచ్.సి.యూ భూములను ఇంచు కూడా తీసుకోలేదు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా విక్రయించడం లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా విక్రయించడం లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజా సంఘాలతో సమవేశమయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం క్రితమే హెచ్.సి.యూ రిజిస్ట్రార్ తో ప్రభుత్వం సంప్రదింపులు చేసిందని తెలిపారు. దీనిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలతో పాటు కొన్ని పార్టీలకు చెందిన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చామని ఆయన తెలిపారు.
రాజకీయ ఆరోపణలు మాత్రమే...
దశాబ్దాలుగా కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమి న్యాయస్థానాల్లోనే నలుగుతుందని తెలిపారు. యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే ఉండాలని తాము చెప్పామని తెలిపారు. గందరగోళం సృష్టించడానికి బీఆర్ఎస్, బీజేపీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని అన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాలుగు వందల ఎకరాల భూమి విషయంలో స్పష్టతతో, న్యాయపరంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇన్ని రోజులు తర్వాత కొలిక్కి తీసుకు రావడానికి, సంక్షేమానికి అభివృద్ధి కోసం తాము ప్రయత్నిస్తుంటే కొందరు బురద జల్లే ప్రయత్నం చేయడం భావ్యం కాదని తెలిపారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలనే మీ ముందుకు వచ్చామని తెలిపారు.
Next Story