Mon Dec 15 2025 00:15:15 GMT+0000 (Coordinated Universal Time)
మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్
గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు

గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 2021లో మూసీ నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందన్న విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో గుర్తుచేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న శ్రీధర్ బాబు మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు.
అక్రమ కట్టడాలను...
మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ సర్కార్ అని శ్రీధర్ బాబు ఆ పార్టీ నేతలకు గుర్తు చేశారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా.? అని ప్రశ్నించారు. మూసీని కాలుష్యరహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా.? మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌ను నిర్ణయించడం నిజం కాదా? అని మంత్రి శ్రీధర్‌బాబు నిలదీశారు.
Next Story

