Mon Dec 23 2024 09:32:11 GMT+0000 (Coordinated Universal Time)
సీఎంకు హరీశ్ రావు వార్నింగ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు. నాలుగేళ్లలో మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చేశావని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దొడ్డిదారిన కొనుగోలు చేసి సీఎం అయ్యావని హరీశ్ రావు మండి పడ్డారు.
పోలికే లేదు...
తెలంగాణతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఏ మాత్రం పోలిక లేదన్నారు హరీశ్ రావు. తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని చెప్పారు. బీజేపీ సెంటిమెంట్ తో నే అధికారంలోకి వస్తుందని అన్నారు. మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. ఏ రంగంలోనూ మధ్యప్రదేశ్ అభివృద్ధి సాధించలేదన్నారు.
Next Story