Mon Dec 23 2024 05:15:47 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం కేసీఆర్ నమ్ముకుంది ఎవరినో చెప్పిన మంత్రి హరీష్ రావు
ఒకనాడు తిండి గింజలకు తిప్పలు పడ్డ మనం.. ఇప్పుడు రెండు పంటలు పండిస్తూ దేశానికే అన్నం
భారతీయ జనతా పార్టీపై మంత్రి హరీష్ రావు మరో సారి విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు జమిలి ఎన్నికలను నమ్ముకుంటే, కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నారని అన్నారు హరీష్ రావు. హిందూ ముస్లింలకు కొట్లాట పెట్టి జనాన్ని పల్టీ కొట్టాలని బీజేపీ నేతలు చూస్తున్నారంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్ సభలో మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని హరీష్ రావు అన్నారు.
హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంరతం రూ.40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ నిఖార్సయిన హిందువు కాబట్టే రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అర్చకులకు జీతాలు, ఆలయాల అభివృద్ధి కొరకు చర్యలు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో గత 9 సంవత్సరాల నుంచి గుంట కూడా ఎండకుండా పంటలు పండుతున్నాయని చెప్పారు. ఒకనాడు తిండి గింజలకు తిప్పలు పడ్డ మనం.. ఇప్పుడు రెండు పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా ఎదిగామన్నారు హరీష్ రావు.
Next Story