Mon Dec 23 2024 03:39:10 GMT+0000 (Coordinated Universal Time)
Harish Rao : నిర్మలమ్మకు హరీశ్ స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోటార్లకు మీటర్లు బిగించనందునే తాము నిధులు ఇవ్వలేదన్న సీతారామన్ వ్యాఖ్యలు సత్యమని అన్నారు. అందుకోసమే తెలంగాణకు నిధులు నిలిపేసిందని కూడా ఆయన తెలిపారు. సిద్ధిపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం వత్తిడి తెచ్చినా కేసీఆర్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదన్నారు. రైతు ప్రయోజనాలే ముఖ్యమని భావించి కేసీఆర్ వేల కోట్ల నిధులను వదులుకున్నారన్నారు.
మోటార్లకు మీటర్లు....
తెలంగాణలో రైతు ప్రయోజనాలే ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని హరీశ్ రావు అన్నారు. రైతు పక్షపాతిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్న హరీశ్ ఢిల్లీలో తమను, తమ పాలనను ప్రశించిన బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి విమర్శలు చేస్తారని అన్నారు. రాజస్థాన్ లో మీటర్లు పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంగీకరించిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ లు రైతు వ్యతిరేక పార్టీలని, బీఆర్ఎస్ మాత్రమే రైతు పక్షపాతి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మీటర్లకు మోటార్లు పెట్టడం ఖాయమని హరీశ్ రావు అన్నారు.
Next Story