Sat Nov 23 2024 21:20:26 GMT+0000 (Coordinated Universal Time)
లీక్ చేసిన హరీశ్ రావు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు తెలంగాణలో సెటిల్ అయిన వారికి మంత్రి హరీశ్్ రావు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు తెలంగాణలో సెటిల్ అయిన వారికి మంత్రి హరీశ్్ రావు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రలో ఓటు హక్కును రద్దు చేసుకుని ఇక్కడ నమోదు చేయించుకోవాలని కోరారు. అందరినీ తెలంగాణ బిడ్డలుగానే చూస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసుకోవాలంటూ హరీశ్ రావు పిలుపునివ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగాల నిమిత్తం ఇక్కడకు వచ్చినా అక్కడకు అప్పుడప్పుుడు వెళుతుంటారని, అక్కడ పరిస్థితులు తెలిసి ఎందుకు ఉండటం అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
మే 1న గుడ్ న్యూస్...
ఎందరో వచ్చి ఇక్కడ స్థిరపడినా కడుపులో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పనున్నారని కూడా ఆయన తెలిపారు. మే 1వ తేదీన కార్మిక దినోత్సవం నాడు కార్మికుల కోసం వరాలను కురిపించనున్నారని ఆయన లీక్ చేశారు. ఏపీలో అభివృద్ధితో పోల్చి చూస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉందన్నారు. అందరూ తెలంగాణ ప్రజలుగానే ప్రభుత్వం భావిస్తుందని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందచేస్తుందని హామీ ఇచ్చారు.
Next Story