Mon Dec 23 2024 09:16:59 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామ కృష్ణరాజుపై ఏం చర్యలు తీసుకున్నారు?
రెండున్నర సంవత్సరాల నుంచి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు
రెండున్నర సంవత్సరాల నుంచి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినా ఎందుకు నానుస్తున్నారన్నారు. ఆయనపై ఎందుకు అనర్హత వేటు వేయలేదన్నారు. మీకు అవసరమైతేనే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. లేకుంటే పక్కన పెడతారన్నారు. గుజరాత్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను తీసుకోలేదా? అని ప్రశ్నించారు. దొడ్దిదారిన అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని నిలదీశారు. కేసీఆర్ పై బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
మోటార్లకు మీటర్లు...
బావికాడ మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా రైతు బంధు పథకాన్ని పొందిన నియోజకవర్గం మునుగోడు అని ఆయన అన్నారు. బీజేపీ నేతలు గల్లీ నాయకుల కంటే దిగజారి మాట్లాడుతున్నారన్నారు.
Next Story