Thu Dec 19 2024 02:53:13 GMT+0000 (Coordinated Universal Time)
బండిపై అనర్హత వేటు వేయండి
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ప్రధాన నిందితుడని మంత్రి హరీశ్‌రావు అన్నారు
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ప్రధాన నిందితుడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ను నేరుగా ఎదుర్కొనలేక దొడ్డిదారిన కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బీజేపీ నేతల కుట్రలు నగ్నంగా బయటపడ్డాయన్నారు. పేపర్ వెనక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని హరీశ్‌రావు ఆరోపించారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్‌కు ముఖ్య అనుచరుడని అన్నారు.
ప్రధాన నిందితుడు...
అలాగే తాండూరులో లీక్ చేసిన టీచర్ బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘ సభ్యుడని హరీశ్‌రావు అన్నారు. తాండూరు, వరంగల్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక బండి సంజయ్ ప్రమేయం ఉందని తెలిపారు. లేకుంటే నిందితులు బండి సంజయ్‌కు ఎందుకు ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్ కూడా బండి సంజయ్ పై అనర్హత వేటు వేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వారిని వదిలిపెట్టకూడదని, నిందితులు ఎంతటి వారైనా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story