Mon Nov 18 2024 02:32:53 GMT+0000 (Coordinated Universal Time)
మాయమాటలు నమ్మొద్దు : హరీశ్‌రావు
మాయమాటలే చెప్పేవారిని నమ్మొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మాయమాటలే చెప్పేవారిని నమ్మొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మూడు గంటలు విద్యుత్తు వస్తుందని, బీఆర్ఎస్కు ఓటేస్తే 24 గంటలు విద్యుత్తు వస్తుందన్నారు. కొడంగల్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మోసపోతే గోస పడతామన్నారు. కాంగ్రెస్ చెప్పిన గ్యారంటీ పథకం వలలో పడవద్దని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు కర్ణాటకలో జరుగుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ కల్యాణలక్ష్మి వస్తుందని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా అని నిలదీశారు.
అధికారంలో ఉన్న...
తెలంగాణలో వృద్ధులకు పింఛను రెండు వేల రూపాయలు ఇస్తుంటే, కర్ణాటకలో ఆరు వందలు ఇస్తున్నారన్నారు. కర్ణాటక, ఛత్తీస్గడ్, రాజస్థాన్‌లో రెండు వేల రూపాయలు ఇస్తేనే జనం నమ్ముతారని హరీశ్‌రావు అన్నారు. రైతు బంధు కూడా అక్కడ ఇవ్వడం లేదన్నారు. కానీ తెలంగాణలో ఓట్ల కోసం ఏదో ఇస్తామని నమ్మబలుకుతూ తిరుగుతున్నారని హరీశ్‌రావు అన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో చేతకాక ఇక్కడ అమలు చేస్తామని అధికారం కావాలని అడుగుతున్నారని అన్నారు. ఇక్కడ బీజేపీ లేచిది లేదు... కాంగ్రెస్ గెలిచేది లేదని.. హ్యాట్రిక్ విక్టరీ కేసీఆర్ దేనని హరీశ్‌రావు అన్నారు.
- Tags
- harish rao
- brs
Next Story