Sun Nov 24 2024 01:04:53 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు సంస్కరణలపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యుత్తు సంస్కరణలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు నలభై వేల మీటర్లు పెట్టారని, దీనిపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్ రావు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు గళం విప్పాలని ఆయన కోరారు. తాము మాత్రం ఎన్ని వత్తిడులు తెచ్చినా బావులకు కరెంట్ మీటర్లు పెట్టబోమని హరీశ్ రావు స్పష్టం చేశారు.
విద్యుత్తు సంస్కరణలను....
భారతీయ జనతా పార్టీ అంటేనే కార్పొరేటర్ల పార్టీ అని హరీశ్ రావు మండి పడ్డారు. విద్యుత్తు సంస్కరణలను అమలు చేస్తేనే రాయితీలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. బీజేపీకి ఓటు వేయకపోతే బుల్ డోజర్లను పంపి తొక్కిస్తామని యూపీ ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
- Tags
- jagan
- harish rao
Next Story