Mon Dec 23 2024 13:37:18 GMT+0000 (Coordinated Universal Time)
బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి భేటీ
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కేటీఆర్ ను కలవడంతో తిరిగి ఆయన బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగించే చర్యలు చేపట్టారు.
బీఆర్ఎస్ లోకి వెళతారంటూ...
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకుని వాటిని పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం మంత్రి బుజ్జగింపులకు మెత్తబడ్డారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. ఆయన రాకను స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తుండటంతో తిరిగి ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే వారిని ఒప్పించి నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది.
Next Story