Thu Dec 26 2024 23:07:25 GMT+0000 (Coordinated Universal Time)
దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల పేర్లు చెప్పు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేసీఆర్ కు దమ్ముంటే వాళ్లతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు
కేసీఆర్ కు దమ్ముంటే వాళ్లతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ పూర్తిగా నిరాశ నిస్పృహలో కూరుకుపోయి అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ పార్టీలో షిండేలు ఎవరూ లేరన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాము అంతాకలసి ఉన్నామని తెలిపారు. కేసీఆర్ కేవలం ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని, తమ లక్ష్యం ఎన్డేఏ మాత్రమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదన్నారు. కాళేశ్వరం నుంచి లిక్కర్ వరకూ అంతా అవినీతి చేశారన్నారు. కేసీఆర్ పాలనలో ఖజానా మొత్తం ఖాళీ అయిందని, ఉద్యోగులకు ఒకటోతేదీ జీతాలు వచ్చేవి కావన్నారు.
ఎఎ ట్యాక్స్ దేశంలో...
ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని, నాలుగు వందల గ్యాస్ సిలిండర్ ను 1200 రూపాయలు చేేసింది ఎవరు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ ఉందని చెబుతున్న మోదీ ఎఎ ట్యాక్స్ దేశంలో వసూలు చేస్తున్నదీ నిజమేనా? అని ప్రశ్నించారు. అదానీ, అంబానీలకు పంచి పెట్టింది మోదీ ప్రభుత్వం కాదా? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండి పడ్డారు. అదానీ, అంబానీ తప్ప మీ హయాంలో ఎవరు బాగుపడ్డారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఇంకా రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారన్నారు. అచ్చేదిన్ తెస్తానని చెప్పి మోదీ ప్రధాని అయ్యాడన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోలు ధరలు తగ్గించలేదన్నారు.
Next Story