Sun Dec 29 2024 15:10:40 GMT+0000 (Coordinated Universal Time)
ఒక గేటు తెరిస్తేనే ఇంత మంది చేరుతన్నారు : కోమటిరెడ్డి
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గతంలో చేసిన పాపాలే ఆయనను వెంటాడుతున్నాయని అన్నారు. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయని కోమటిరెడ్డి అన్నారు. యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చి ఆయన తొలి తప్పు చేశారన్నారు. కేసీఆర్ చేసిన పాపాల కారణంగానే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు.
కరువు కూడా...
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు కోసం ఎదురు చూసే వారం కాదన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి అందులో కమీషన్లు దండుకున్నారని ఫైర్ అయ్యారు. ఒక గేటు తెరిస్తేనే కాంగ్రెస్ లోకి ఇంతమంది వచ్చి చేరుతున్నారని, అన్ని గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Next Story