Mon Dec 23 2024 06:23:07 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్
కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాము సైగచేస్తే బీఆఎస్ ఖాళీ అయిపోతుందన్నారు. ఒక్క నేత కూడా మిగలదన్నారు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ ను మూడు నెలల్లో ఖతం చేస్తామని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు.
జగదీష్ రెడ్డి జైలుకే....
ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడం ఎవరి తరమూ కాదన్నారు. అలాచేస్తే ప్రజలే తిరగబడతారన్నారు. కేసీఆర్ ను ప్రజలు ఛీకొట్టినా ఇంకా బుద్ధిరాలేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పునాదులు కూల్చేస్తామని హెచ్చరించారు. దేశంలోని దరిద్రమైన పాలన బీఆర్ఎస్ దేనని అననారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ కనుమరుగతవుతుందని, మెదక్ లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవదన్నారు. త్వరలో జగదీష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Next Story