Mon Dec 23 2024 08:52:01 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఏపీ వినియోగించే భవనాలపై నివేదిక కోరిన మంత్రి కోమటిరెడ్డి
ఏపీ ప్రభుత్వం అధీనంలోని భవనాల స్వాధీనం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి ఆర్అండ్బి శాఖ అధికారులను నివేదిక కోరారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలోని భవనాల స్వాధీనం కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి ఆర్అండ్బి శాఖ అధికారులను నివేదిక కోరారు. ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు.
చంద్రబాబుతో భేటీలో...
ఈనెల 6వ తేదీన విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ బి శాఖకు చెందిన అతిధి గృహాలతో పాటు కొన్ని భవనాలను ఇప్పటికీ ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో వాటిని చంద్రబాబుతో జరిగే చర్చల్లో తిరిగి తీసుకోవాలని నిర్ణయించారు.
Next Story