Sun Dec 22 2024 23:04:12 GMT+0000 (Coordinated Universal Time)
Konda Surekha : చిక్కుల్లో మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వరంగల్ జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు
మంత్రి కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వరంగల్ జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గాల్లో కొండా సురేఖ వర్గం ఇబ్బందిపెడుతుందని వారు ఆరోపించారు. కొండా సురేఖ తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపించారు.
హైకమాండ్ ను కలసి...
నిన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలిసి తమ ఫిర్యాదును అందచేశారు. ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలసి ఫిర్యాదు చేశారు. అయితే అది తమ పార్టీ అంతర్గత విషయమని, చర్చించి పరిష్కరించుకుంటామని మహేష్ గౌడ్ తెలిపారు. హైకమాండ్ ను కలసిన వారిలో పరకాల, భూపాలపల్లి, స్టేషన్ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి ఎమ్మెల్యేలున్నారు.
Next Story