Thu Oct 03 2024 11:26:21 GMT+0000 (Coordinated Universal Time)
Konda Surekha : సమంతకు సారీ చెప్పిన కొండా సురేఖ
సినీ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
సినీ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సమంతను ట్యాగ్ చేస్తూ మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. సమంతకు క్షమాపణలు చెప్పారు. "మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు.. స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం.. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా" అని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు.
వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా...
నిన్న కేటీఆర్ పై మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సినీ రంగం నుంచి అనేక మంది కొండా సురేఖపై విమర్శలు చేశారు. రాజకీయ అవసరాలు, విమర్శల కోసం సినీరంగానికి చెందిన మహిళలను లాగడం సరికాదని తెలిపారు. ఈ నేపథ్యంలో సమంత కూడా తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలిపింది. నాగార్జున, నాగచైతన్య కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో మంత్రి సమంతకు సారీ చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
Next Story