Mon Dec 23 2024 10:47:03 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడును దత్తత్త తీసుకుంటా
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే తాను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే తాను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి అభివృద్ధి పనులను సమీక్షిస్తానని తెలిపారు. ఒక కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి ఈ ఎన్నికలు పరీక్ష అని మంత్రి కేటీఆర్ అన్నారు. కూసుకుంట్ల నామినేషన్ సందర్భంగా జరిగిన భారీ ర్యాలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
దేవుళ్లను కూడా...
దేవుళ్లను కూడా కొందరు రాజకీయాలకు వాడుకుంటారని ఆయన మండిపడ్డారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్లను పెంచితే మోదీ పెద్దోళ్లకు ప్రజా ధనాన్ని దోచి పెడుతున్నారని అన్నారు. ప్రజలపై బలవంతంగా రుద్దిన ఈ ఎన్నిక ఎందుకో ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు. తిరుమలకు దీటుగా యాదాద్రిని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క కేసీఆర్ దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ను మునుగోడులో గెలిపించాలని ఆయన కోరారు.
Next Story