Thu Dec 19 2024 14:49:24 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్లో కోమటిరెడ్డిని బ్లాక్ చేసిన కేటీఆర్
తెలంగాణ ద్రోహుల జాడ చెప్పలేక భయపడి తనను కేటీఆర్ బ్లాక్ చేశారంటూ ఆయన తెలిపారు. తెలంగాణ..
ఇటీవల కాలంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయనను నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డి శుక్రవారం రాత్రి ట్విట్టర్ వేదికగానే వెల్లడించారు. తనను కేటీఆర్ బ్లాక్ చేయడంపై కాస్త ఘాటుగానే స్పందించారు రాజగోపాల్ రెడ్డి.
తెలంగాణ ద్రోహుల జాడ చెప్పలేక భయపడి తనను కేటీఆర్ బ్లాక్ చేశారంటూ ఆయన తెలిపారు. తెలంగాణ ద్రోహులు ఇచ్చిన కానుకలు స్వీకరించి వారికి పదవులు కట్టబెట్టిన మీరు... వారికి భయపడకుండా ఎందుకు ఉంటారని కూడా కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. చివరికి టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహులతో నిండిపోయిందని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.
Next Story