Mon Dec 23 2024 16:27:25 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్ పిట్ట తోకముడిచిందంటూ కేటీఆర్ పై టి-కాంగ్రెస్ ట్వీట్
తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం చెప్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పర్యటన తర్వాత కాంగ్రెస్..
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశారు. ఇదే అదనుగా భావించిన టి-కాంగ్రెస్ కేటీఆర్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసింది. అంతకుముందు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కేటీఆర్ తమ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశారంటూ ట్వీట్ చేసింది.
తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం చెప్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పర్యటన తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న పొరపాట్లేమిటో రాహుల్ ఇప్పటికైనా తెలుసుకుంటారంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్ కు బదులుగా.. రేవంత్ మరో ట్వీట్ చేశారు. " మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్! రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి? ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలాబిగించాలి? వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు? ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు." అని రేవంత్ ట్వీట్ చేశారు.
వెంటనే మంత్రి కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేశారు. దాంతో " ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోంది." అని టి- కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
Next Story