Thu Dec 19 2024 01:58:26 GMT+0000 (Coordinated Universal Time)
KTR : నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో తన నామినేషన్ ను దాఖలు చేశారు.
![ktr, brs, working president, nomination, siricilla constituency, telangana elections ktr, brs, working president, nomination, siricilla constituency, telangana elections](https://www.telugupost.com/h-upload/2023/11/09/1558853-ktr.webp)
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో తన నామినేషన్ ను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నిర్ణయించిన ముహూర్తానికే ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు. వేలాది మంది వెంటరాగా తన నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
పూజల అనంతరం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన ఐదో సారి గెలిచేందుకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందచే శారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరోసారి కేసీఆర్ సర్కార్ ను ఆశీర్వదించాలని కోరారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ రావాలా? అంటూ కోరారు. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? అంటూ ప్రశ్నించారు. 23 ఏళ్ల నుంచి వినిపిస్తున్న తెలంగాణ గొంతుకను అణిచివేసేందుకు గుజరాత్, ఢిల్లీ నేతలు ప్రయత్నిస్తున్నారని, దీనిని తెలంగాణవాదులు అడ్డుకోవాలని ఆయన కోరారు.
Next Story