Mon Dec 23 2024 14:49:15 GMT+0000 (Coordinated Universal Time)
ఉప్పల్ స్కైవాక్ ను ప్రారంభించిన కేటీఆర్.. ప్రత్యేకతలేంటో చూడండి
ఉప్పల్ రింగ్ వద్ద పాదచారుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ స్కైవాక్.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే అత్యంత..
భాగ్యనగర శిగలో మరో మణిహారం చేరింది. సుమారు రూ.25 కోట్లతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఉప్పల్ రింగ్ వద్ద పాదచారుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ స్కైవాక్.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే అత్యంత పొడవైన స్కైవాక్ ఇదే కావటం మరో విశేషం. ఈ స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు, వెడల్పు -వర్టికల్ వెడల్పు- 3, 4,6 మీటర్లు, ఎత్తు -6 మీటర్లు, 8 లిఫ్ట్ లు , 4 ఎస్కలేటర్లతో పాటు మెట్ల సౌకర్యం కూడా ఉంది. ఆరు చోట్ల ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్స్ ఏర్పాటు చేశారు. బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైన రూఫ్ కవరింగ్ కూడా చేశారు. స్కైవాక్ నిర్మాణానికి 1000 టన్నుల స్టీల్ ను ఉపయోగించారు.
ఉప్పల్ ప్రాంతంలో ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మించిన ఈ స్కైవాక్ నేటి నుంచి నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. మెట్రోరైలు ట్రాక్ నిర్మాణానికి ఇంచుమించు అదే ఎత్తులో సరికొత్తగా రూపుదిద్దుకుంది ఈ స్కైవాక్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిపై నడుస్తుంటే.. ట్రాఫిక్ సౌండ్ లు కూడా పెద్దగా వినిపించవు. స్కై వాక్ పై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు.. ఎవరేం చేస్తున్నారో క్లియర్ గా మానిటర్ అవుతుంది.
Next Story