Mon Nov 25 2024 05:14:04 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రం పై కేటీఆర్ ఘాటు విమర్శలు
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. దేశంలో బీజేపీ మత చిచ్చు పెడుతుందన్నారు
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. దేశంలో మత చిచ్చు పెట్టి ఆ మంటల్లో బీజేపీ చలి కాచుకుంటుందని ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా నిన్న 25 కోట్ల ముస్లిం సోదరులు రోడ్డెక్కాల్సిన పరిస్థిితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. బీజేపీ కుల, మతపిచ్చితో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుందని కేటీఆర్ అన్నారు. రెండు లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను కేంద్రం ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. తెలంగాణకు మొండి చేయి చూపుతుందన్నారు.
కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.....
దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతుందన్నారు. తెలంగాణ రాకముందు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని అన్నారు. ఖమ్మం అభివృద్ధికి మంత్రి పువ్వాడ అజయ్ పాటుపడుతుంటే ఆయనపై కూడా కొందరు బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారన్నారు. తన నియోజకవర్గం బాగుండాలనే ఆలోచనే పువ్వాడకు ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలతో కేంద్రం కులుకుతూ రాష్ట్రాన్ని అన్యాయం ేస్తున్నారన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని కేటీఆర్ చెప్పారు.
Next Story