Mon Dec 23 2024 12:43:40 GMT+0000 (Coordinated Universal Time)
డబ్బులు అడిగితే చెంప చెళ్లుమనిపించండి.. కేటీఆర్ పిలుపు
తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు
తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. లంచం అడిగిన అధికారులను చెంపచెళ్లుమనిపించాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లా జిల్లాలో పర్యటించిన కేటీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు వస్తాయని ఆయన తెలిపారు. ఇళ్లు రాలేదని కంగారు పడవద్దని అధికారులే ఇళ్లకు వచ్చి మంజూరు చేస్తారని కేటీఆర్ తెలిపారు.
అవినీతి లేకుండా....
ఈ పధకంలో అవినీతి లేకుండా చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా చేశారన్నారు. ఎవరి సిఫార్సు లేకుండానే డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు. ఒక్క పైసా ఎవరికీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇళ్లు ఇప్పిస్తామని దళారులు వస్తే దగ్గరకు కూడా రావద్దని కోరారు.
రాజకీయ ప్రమేయం....
అవినీతి లేకుండా ఈ పథకాన్ని అర్హులైన వారందరికీ అందజేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యమని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ పథకాన్ని నిలపాలన్నారు. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యునిటీ లో మాదిరిగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదలకు ఇస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని, పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్లు వస్తాయని చెప్పారు.
Next Story