ఆయనను సస్పెండ్ చేశారు.. ఈయనను ఏం చేయాలి స్పీకర్ సర్.? : కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. లోక్సభలో నిన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. గతంలో ప్రధాని ఇంటిపేరు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నిన్న లోక్సభలో రాష్ట్రానికి రెండుసార్లు ఎన్నికైన జనాధరణ కలిగిన సీఎం కేసీఆర్ను అత్యంత నీచమైన భాషలో కించపరిచారు. మీరు/మేము ఇప్పుడు ఏమి చేయాలి స్పీకర్ సార్? అంటూ ప్రశ్నించారు.
లోక్ సభలో నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని.. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ కూటమి I-N-D-I-A గా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. తెలంగాణ రైతుల ఆదాయం పెరగలేదు కానీ.. సీఎం కుటుంబం ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుమారుడి ఆస్తులు 400 రెట్లు, సీఎం భార్య ఆస్తులు 1800 శాతం పెరిగాయని ఆరోపించారు.