Mon Dec 23 2024 15:16:10 GMT+0000 (Coordinated Universal Time)
యాదాద్రిని సంప్రోక్షణ చేయండి.. వేదపండితులకు కేటీఆర్ సూచన
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ పై ఛార్జిషీట్ ను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు
తమ పార్టీ చేసిన పనులు చెబుతూ ఓట్లు అడుగుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ పై ఛార్జిషీట్ ను ఆయన దాఖలు చేశారు. చేసిన పనులు, చేయబోయే అభివృద్ధి పనుల గురించి తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నామని తెలిపారు. తాను దత్తత తీసుకుని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు అడుగుతున్నామని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం తాము ఈ మంచి పనులు చేశామని చెప్పుకోలేకపోతుందన్నారు. ఎనిమిదేళ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పకపోగా, వ్యక్తిగత నిందారోపణలు చేస్తున్నారన్నారు.
ఫ్లోరిసిస్ సమస్యను...
ఫ్లోరోసిస్ సమస్యను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నీతి ఆయోగ్ 19వేల కోట్లు మిషన్ భగీరధకు ఇవ్వాలని చెప్పినా ఇవ్వలేదన్నారు. జేపీ నడ్డా అధ్యక్షుడు ఆనాటి ఆరోగ్యశాఖమంత్రిగా మునుగోడుకు వచ్చి ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి మాట తప్పారన్నారు. చేనేతలపై జీఎస్టీ విధించారన్నారు. నేతన్నల కడుపు కొట్టేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. నాలుగు వందల సిలిండర్ ధరను పన్నెండు వందలు చేసినందుకు ఓట్లు వేసినందుకు ఆడబిడ్డల తరుపున ఈ ఛార్జిషీటు వేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతన్నల తరుపున ఛార్జిషీట్ ను వేస్తున్నామని చెప్పారు.
మోడీ చమురు ధరను...
ముడిచరుకు ధర పెరగకపోయినా మోడీ చమురు ధరలు పెంచి మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచారన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ ఛార్జిషీట్ ను వేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతూ పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా ఉన్నందుకు గిరిజన బిడ్డల తరుపున ఛార్జిషీట్ వేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల ప్రజలను ఈ కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. బీసీల జనగణనకు మోకాలడ్డినందుకు మొండిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ పై ఈ ఛార్జిషీటు వేస్తున్నామని చెప్పారు. మైనారిటీల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ఛార్జిషీట్ ను వేస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ వర్గాలకు లక్షల కోట్లు దోచి పెడుతూ, ఉచిత పథకాలు వేస్ట్ అంటున్న మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ఈ ఛార్జిషీట్ ను వేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. దర్యాప్తులో ఉన్నప్పుడు తాను మాట్లాడటం బాగుండదన్నారు. ప్రమాణాలతో తప్పులు సమసిపోతున్నాయంటే ఇక కోర్టులు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ వాళ్ల చెప్పులు మోసిన వాళ్లు ప్రమాణం చేసినందుకు సంప్రోక్షణ చేాయాలని యాదాద్రి వేదపండితులను కోరుతున్నానని చెప్పారు.
- Tags
- ktr
- charge sheet
Next Story