Mon Dec 23 2024 03:39:08 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ సంబరం.. బైకు కధ వింటే?
మంత్రి కేటీఆర్ తన పాత సంగతులను గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు
మంత్రి కేటీఆర్ తన పాత సంగతులను గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. విద్యార్థిగా తాను ఉన్న సమయంలో నిజాం కళాశాలలో తాను నడిపిన బైక్ ను గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ బైక్ చెక్కు చెదరలేదని చెప్పుకొచ్చారు. 29 ఏళ్లు అయినా మంచి కండిషన్ లో ఉందని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశఆరు. ఈ కింది ఫొటోలో కనిపిస్తుంది ఆ బైకేనంటూ ట్విట్టర్లో కొన్ని పోస్టులు జత చేశారు. సంబరపడిపోయారు.
1990 నాటి బైక్...
తన పాత బైక్ ను గుర్తు చేసుకుంటూ మంత్రి కేటీఆర్ ఆ జమానాకి వెళ్లిపోయారు. 24 ఏళ్ల క్రితం తాను కేటీఆర్ నుంచి తీసుకున్న బైక్ ను తాను ఇప్పటికీ వాడుతున్నానని జాన్సన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరి కేటీఆర్ తో కలసి బైక్ పై తిరగాలని ఉందని జాన్సన్ పోస్టు చూసిన కేటీఆర్ సంబరపడ్డారు. 1990లో సుజుకీ సమురాయ్ బైక్ పై తాము తిరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.
Next Story