Sat Nov 23 2024 04:04:31 GMT+0000 (Coordinated Universal Time)
తాగునీటి కోసం ఆరువేల కోట్లు ఖర్చు
హైదరాబాద్ కు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ కు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 1200 కోట్ల ఏర్పాటు చేసిన నీటి పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న ముప్ఫయి ఏళ్లలో హైదరాబాద్ కు వచ్చే జనాభాను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు.
ఓఆర్ఆర్ లోపల ఉన్న....
అవుటర్ రింగ్ రోడ్డు లోపు ఉన్న 25 మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా కల్పించేందుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటిని సరఫరా చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్ లో ఇక్కడ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పా,రు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story