Thu Dec 26 2024 13:31:58 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే గుడ్ న్యూస్ : కేటీఆర్
త్వరలో కేసీఆర్ నోటి వెంట శుభవార్త వింటారని మంత్రి కేటీఆర్ అన్నారు.
త్వరలో కేసీఆర్ నోటి వెంట శుభవార్త వింటారని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్ అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. వరంగల్ జిల్లాలో జరిగిన భహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అంటే సంక్షేమం.. విపక్షం అంటే సంక్షోభం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను నమ్ముకుంటే అధోగతి అని ఆయన అన్నారు. ప్రజలు మూడోసారి కేసీఆర్కు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారన్న కేటీఆర్ విపక్షాల మాటలను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.
మాయ మాటలను...
అరవై ఏళ్లలో అభివృద్ధి చేయని కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాయమాటలను ఎవరూ నమ్మ వద్దని ఆయన కోరారు. పొలిటికల్ టూరిస్ట్ లు చెప్పే మాటలను విశ్వసించవద్దన్నారు. తాము ఎవరికీ బి టీం కాదని, తెలంగాణలో తామే ఎ టీమ్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనం ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
Next Story