అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనాలనుకుంటున్నాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానీ నుంచి రక్షించడానికే కొనుగోలు చేయాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా బలోపేతం చేయాలన్న దానిపై కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తుంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్్ఐసీ ద్వారానే రైతు బీమా చేయించన నేత కేసీఆర్ అని అన్నారు. మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించిన ఘనత కేసీఆర్ అని అన్నారు. దానివల్ల కార్మిక, ఉద్యోగులు అభద్రతకు లోను కారరని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెబితే బయ్యారం విషయంలో ఎందుకు చొరవ చూపించడం లేదని బండి సంజయ్ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం వెనక భారీ కుట్ర ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే పోర్టులన్నీ అదానీ పరమయ్యాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కున్న కోట్లాది ఆస్తులను కాజేయడానికే పెద్దలు కన్నేశారని అన్నారు.