Mon Nov 25 2024 10:47:43 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీలో కేటీఆర్ వారికి వార్నింగ్
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ లో ఆయన మాట్లాడారు
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కు వరదలొచ్చి ఇంతకాలం అవుతున్నా ఇంతవరకూ కేంద్రం నుంచి నిధులు విడుదల కాలేదన్నారు. గుజరాత్ కు వరదలొస్తే మోదీ వెయ్యి కోట్లు విడుదల చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వివక్ష దేనికని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? అని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ అభివృద్దికి కంటొన్మెట్ అధికారులు అడ్డుపడుతున్నారన్నారు.
తాము నీళ్లు బంద్ చేస్తాం....
కంటోన్మెంట్ అధికారులు తమ ఇష్టారాజ్యం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్రించారు. వాళ్లు రోడ్లు బంద్ చేస్తే తాము నీళ్లు, విద్యుత్తును నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోయే పరిస్థిితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందేనని కేటీఆర్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు.
Next Story