Sat Dec 28 2024 11:25:12 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు ప్రజలారా... అలర్ట్ గా ఉండండి
మునుగోడు ఉప ఎన్నికలోనూ బీజేపీ అదే డ్రామా చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికలోనూ బీజేపీ అదే డ్రామా చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతికి కట్టుతో త్వరలో మీ ముందుకు వస్తారని, కాని వాటిని ప్రజలు నమ్మవద్దని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్, దుబ్బాకలో ఆడిన డ్రామానే మునుగోడులోనూ చేయడానికి ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్ మీడియాతో జరిగిన చిట్ చాట్ లో తెలిపారు.
గాయమయిందని....
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతుందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే గాయం అయిందని కట్టుతో కనిపించి సానుభూతి పొందే ప్రయత్నాలు కూడా త్వరలో జరుగుతాయని, ప్రజలు వాటిని నమ్మవద్దని కేటీఆర్ కోరారు. మునుగోడులో ఎన్ని కుట్రలు చేసినా చివరకు ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలుస్తారని ఆయన అన్నారు.
Next Story