Mon Dec 23 2024 15:27:34 GMT+0000 (Coordinated Universal Time)
పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. పొన్నాల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి కేటీఆర్ ఈ రోజు పొన్నాల నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ మాజీ నేతను పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ వెళ్లినట్లు తెలుస్తోంది. పొన్నాల నివాసానికి ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం మాట్లాడుతూ... పొన్నాల పార్టీలోకి వస్తామంటే ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే కేటీఆర్ చేసి చూపించారు.
శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పొన్నాల మా పార్టీలోకి వస్తానంటే సంతోషం. రేపే ఆయన ఇంటికి వెళ్తానన్నారు. నేనే ఆయన్ని దగ్గరుండి పార్టీలోకి ఆహ్వానిస్తానని కేటీఆర్ చెప్పారు. ఈ నెల 16వ తేదీన పొన్నాల కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్నారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. కాంగ్రెస్‌లో తనకు అవమానం జరిగిందని లేఖలో వివరించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చా. 45 ఏళ్ల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరంగా ఉందని అన్నారు.
Next Story