Thu Dec 19 2024 18:13:15 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల ఇంటికి వెళతా
తమ జిల్లాపరిధిలోని ఎమ్మెల్యేలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు
తమ జిల్లాపరిధిలోని ఎమ్మెల్యేలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే తాను ఎమ్మెల్యేల ఇంటికి వెళతానని ఆయన చెప్పారు. నిన్న మంత్రి మల్లారెడ్డి వైఖరిని నిరసిస్తూ మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి కేటాయిస్తున్నారని, తన నియోజకవర్గానికే పదవులు ఇచ్చుకుంటున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
విభేదాలు లేవు...
దీనిపై మల్లారెడ్డి స్పందిస్తూ తన జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలతో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానించి మాట్లాడేందుకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ఏవైనా సమస్యలుంటే అందరం కలసి కూర్చుని పరిష్కరించుకుంటామని మల్లారెడ్డి చెప్పారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు.
- Tags
- mallareddy
- mlas
Next Story