Mon Dec 23 2024 03:30:29 GMT+0000 (Coordinated Universal Time)
ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాగ్వాదం
మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పి కారణంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన మల్లారెడ్డి తన కుమారుడిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులను కోరినా అందుకు అనుమతించలేదు. కానీ తన కుమారుడికి బాగా లేకపోతే ఎందుకు పోనివ్వరంటూ ఐటీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. చివరకు ఇద్దరు అధికారులు, పోలీసులు సిబ్బంది వెంటరాగా మల్లారెడ్డి ఆసుపత్రి బయలుదేరి వెళ్లిపోయారు.
పెద్దకుమారుడికి అస్వస్వత...
మల్లారెడ్డి కుమారుడిని చేర్పించిన నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తన కొడుకును రాత్రంతా అధికారులు ఇబ్బందులు పెట్టారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కళాశాలల్లో పేద పిల్లలకు చదువు తక్కువ ధరకే విద్యను అందిస్తున్నామని, తాము స్మగ్లింగ్ చేయడం లేదని మల్లారెడ్డి ఐటీ అధికారులపై మండి పడ్డారు. చివరకు తన కుమారుడిని పరామర్శించేందుకు అంగీకరించడంతో మల్లారెడ్డి దంపతులు ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.
Next Story