Mon Dec 23 2024 13:26:43 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు
వరంగల్ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు
వరంగల్ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వరంగల్ ను అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు. అన్ని రకాలుగా వరంగల్ ను అభివృద్ధి చేసి రాష్ట్రానికి రెండో రాజధానిగా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని కూడా పొంగుటేటి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
ఎయిర్ పోర్టు రావాలంటే?
మమూనూరు ఎయిర్పోర్ట్కు అవాంతరాలు తొలిగిపోయాయన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్రం అనుమతి ఇస్తే వరంగల్కు ఎయిర్పోర్ట్ వస్తుందని తెలిపారు. భద్రకాళి జలశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని మంత్రి చెప్పారు. భద్రకాళి చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు. తప్పవని కూడా మంత్రి పొంగులేటి హెచ్చరించారు.
Next Story