Mon Dec 23 2024 04:18:20 GMT+0000 (Coordinated Universal Time)
కుల సర్వేలో పాల్గొనని కేసీఆర్ : పొన్నం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి కావచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి కావచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఇందులో రాజకీయాలు లేవన్న మంత్రి గతంలో టిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చామని గుర్తు చేశారు.
అనేక మంది రాజకీయ నేతలు...
ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వే కు సహకరించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. సమాచారాన్ని ఇవ్వకుండా బీసీ లకు వ్యతిరేకంగా ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పాలంటూ ఆయన ఎదురుదాడికిదిగారు. ప్రభుత్వం తీసుకున్న సర్వే లో మీరు లేకుండా ఉండటం మంచిది కాదన్న పొన్నం ప్రభాకర్ సమగ్ర సర్వేలో అందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story