Mon Dec 23 2024 09:20:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ప్రచారంపై మంత్రి ఏమన్నారంటే?
తెలంగాణలో పాఠశాలలు బంద్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఖండించారు.
తెలంగాణలో పాఠశాలలు బంద్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. కొందరు కావాలనే స్కూళ్లు బంద్ అని ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని ఆమె తెలిపారు. పాఠశాలలు యధావిధిగా నడుస్తాయని సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలు నడుపుతామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని ఆమె కోరారు.
వదంతులు నమ్మవద్దు...
రెండు రోజుల క్రితం ఒక గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా సోకిందని వార్తలు రావడంతో తెలంగాణలో పాఠశాలలు బంద్ అంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని మంత్రి స్వయంా ఖండించారు. పాఠశాలలు నడపాల్సిందేనని ఆమె తెలిపారు.
Next Story