Mon Sep 23 2024 14:30:48 GMT+0000 (Coordinated Universal Time)
Seethakka : మంత్రి సీతక్కకు వీరాభిమాని మహేశ్‌బాబు సతీమణి నమ్రత
మంత్రి సీతక్కకు ఎంతోమంది అభిమానులు న్నారు.అందులో మహేశ్ బాబు సతీమణి నమ్రత ఒకరు
సహజంగా సినిమా సెలబ్రిటీలకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. రాజకీయ నేతలకంటే సినీ సెలబ్రిటీలకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. కానీ మంత్రి సీతక్క చాలా సింపుల్ గా ఉంటారు. మావోయిస్టుల నుంచి మంత్రిగా ఎదిగిన సీతక్కకు ఎలాంటి భేషజాలు ఉండవు. కరోనా సమయంలో ములుగు ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారు.
రేవంత్ రెడ్డి ఇంట్లో...
అయితే మంత్రి సీతక్కకు ఎంతోమంది అభిమానులున్నారు.అందులో మహేశ్ బాబు సతీమణి నమ్రత ఒకరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరద బాధితుల కోసం విరాళం ఇచ్చేందుకు వచ్చిన మహేశ్ బాబు, సీతక్కలు అక్కడే ఉన్న సీతక్కను కలిశారు. ఈ సందర్బంగా నమ్రత సీతక్కతో తాను మీ అభిమానినంటూ ఫొటో దిగారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story