Fri Dec 20 2024 04:29:03 GMT+0000 (Coordinated Universal Time)
మేడారం జాతరకు 75 కోట్లు విడుదల
మేడారం జాతర వచ్చే నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మంత్రి సీతక్క తెలిపారు
మేడారం జాతర వచ్చే నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మేడారం జాతరపై సీతక్క అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో మేడారం జాతరలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మేడారం జాతరకు ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు సిద్ధం చేశారని మంత్రి సీతక్క తెలిపారు. అధికారులు రూపొందించిన అంచనాల ప్రకారం సీతక్క ఆ నిధులను విడుదల చేశారు.
అన్ని ఏర్పాట్లు ...
మేడారం జాతరకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తామని సీతక్క తెలిపారు. నిధులు తక్కువగా ఇచ్చామని అపోహలకు గురి కావద్దని, జాతర సజావుగా చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. జాతరకు వచ్చిన భక్తులు ఎవరూ ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేసే పనులన్నింటినీ శాశ్వత ప్రాతిపదికపైన చేస్తామని ఆమె తెలిపారు. ప్రధానంగా జాతరంగా సందర్భంగా పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ఆర్టీసీ సర్వీసులు, రక్షిత మంచినీటి సరఫరా వంటి వాటిపై దృష్టి పెట్టామన్నారు.
Next Story