Thu Dec 19 2024 17:04:44 GMT+0000 (Coordinated Universal Time)
Sitakka : మంత్రి సీతక్క తొలిసారి ములుగుకు రావడంతో?
మేడారం సమ్మక్క-సారలమ్మను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మంత్రి అయ్యాక తొలిసారి ఆమె ములుగు ప్రాంతంలో పర్యటించారు
మేడారం సమ్మక్క-సారలమ్మను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మంత్రి అయ్యాక తొలిసారి ఆమె ములుగు ప్రాంతంలో పర్యటించారు. సీతక్క మంత్రిగా ములుగు వస్తుండటంతో పెద్దయెత్తున అభిమానులు చేరి ఆమెకు శుభాకాంక్షలు అందచేశారు. మంత్రిగా బాధ్యతలను తీసుకున్న వెంటనే తన సొంత ఊరికి కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సీతక్క కల్పించారు.
మేడారం జాతరకు...
అయితే మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సీతక్క పరిశీలించారు. తాను ఏ స్థాయిలో ఉన్నా ములుగు ఆడబిడ్డనేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తాంమని మాట ఇచ్చారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న సీతక్క ములుగు నుంచి పాలన కొనసాగిస్తానని చెప్పారు.
Next Story