Mon Nov 18 2024 14:48:41 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
కేసీఆర్ అన్నీ అబద్ధాలు చెప్పి వెళ్లాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు
కేసీఆర్ అన్నీ అబద్ధాలు చెప్పి వెళ్లాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వల్లనే కరువు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే బీటలు వారిందన్నారు. కమీషన్ల కక్కుర్తితో కేసీఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి నిర్మించడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ భయంతో ఉన్నారన్నారు. నీటిపారుదల శాఖను కేసీఆర్ సర్వనాశనం చేశారన్నారు. ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. మిషన్ భగీరధను సక్రమంగా చేసి ఉంటే ఈరోజు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తేది కాదని ఆయన అన్నారు.
రైతులను ఆదుకుంటాం...
23 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదిలేసింది కూడా కేసీఆర్ హయాంలోనే జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వర్షాలు తక్కువ పడ్డాయి కాబట్టే ప్రాజెక్టులో నీళ్లు లేవన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని ఆయన అన్నారు. కేసీఆర్ మాటలు వికారంగా ఉన్నాయన్న ఉత్తమ్ లేని పోని నిందలు వేస్తే ఇక్కడ ఊరుకునే వాళ్లు ఎవరూ లేరన్నారు. గత ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేయవద్దని నిపుణులు సలహా ఇచ్చారన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు. ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Next Story